విజయవాడ : నవ్వండి… నవ్వించండి… ఆరోగ్యాన్ని పంచండి.. అంటూ లాఫ్టర్ క్లబ్ సభ్యుల సందడితో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నవ్వులతో ప్రతిధ్వనించింది. నవ్వితే నూరేళ్లూ … అన్న నినాదంతో వయసు భేదాలు మరిచి సభ్యులంతా నవ్వుల పువ్వులు పూయించారు. 1995లో ప్రారంభమైన నవ్వుల యోగా క్లబ్బులు ప్రస్తుతం 72 దేశాల్లో విస్తరించాయని క్లబ్ అధ్యక్షుడు హనుమంతరావు తెలిపారు. నవ్వులతోనే దైనందిన జీవితంలో ఒత్తిళ్లను అధిగమించవచ్చని క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మదన్ కమారియా చెప్పేవారని ఆయన అన్నారు. హాస్యబ్రహ్మ జంధ్యాలను కూడా ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా వీరితో కలిసి నవ్వుల ర్యాలీ నిర్వహించారు.




