Tuesday, 3 November 2026

ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. తితిదే ఆధ్వర్యంలో వేదపండితులు ఆగమశాస్త్ర ప్రకారం క్రతువు నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి, తితిదే జేఈవో పోలా భాస్కర్‌, మాజీ కేంద్రమంత్రి సాయిప్రతాప్‌ తదితరులు ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం, మాల ఓబన్న పుస్తకాలను ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *