Wednesday, 4 November 2026

ఒడిసా వద్ద అల్పపీడనం

విశాఖపట్నం, సెప్టెంబరు 21: ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా, పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో విస్తారంగా, దక్షిణకోస్తా, రాయలసీమ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *