Wednesday, 4 November 2026

ఓటరు జాబితాలను ఆధార్‌తో అనుసంధానించాలి

కాకినాడ,మార్చి3(జ‌నంసాక్షి): ఓటరు జాబితాలను ఆధార్‌కార్డులతో అనుసంధానంచేసే పక్రియను వేగంగా నిర్వహించాలని పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎల్‌ విజయసారధి సూచించారు. జాతీయ ఓటరు జాబితా శుద్ధీకరణ అధీకృతం చేసేందుకు స్థానిక తహశీల్దారు కార్యాలయంలో ఆయన పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ బూత్‌ అధికారులు వారి పరిధిలో ఓటర్ల వద్దకు వెళ్లి ఆధార్‌ నకలు, ఎన్నికల ఓటరు గుర్తింపు కార్డు నకలు, మొబైల్‌ నెం, ఈమెయిల్‌ ఐడీ వంటి వివరాలను సేకరించాలన్నారు. ఓటరు జాబితా ఫొటోల్లో తేడాలుంటే ఈ సమయంలోనే వాటిని సరిచేయాలని సూచించారు. ఈ ఏడాది జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండి ఓటు హక్కు పొందని వారికి ఇప్పుడు ఓటు హక్కు కల్పించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *