కడప,మార్చి3(జనంసాక్షి): రకరకాల పేర్లతో పాఠశాలలను సృష్టిస్తూ, మెరుగైన వసతులను కల్పించకుండా విద్యారంగ నిర్వీర్యానికి ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు విమర్శించారు. మంగళవారం సుండుపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం క్లస్టర్ స్కూళ్ల ప్రతిపాదనతో మరో అశాసౄయ ప్రయోగానికి దిగబోతుందని ఆరోపించారు. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, వెలుగు, మోడల్, సక్సెస్ పేరుతో పలు విభాగాలుగా వేరు చేశారన్నారు. అయితే సరైన సదుపాయాలను కల్పించకుండా గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. వాటికి మౌలిక వసతులను, విధివిధానాలను సమగ్రంగా రూపొందించాలని సూచించారు.




