Wednesday, 4 November 2026

కడపలో చిన్నారి అపహరణ…. ఆపై హత్య చేసిన దుండగులు

కడప : కడపలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ చిన్నారిని అపహరించి.. ఆపై హత్య చేసి పెన్నా నదిలో పడేశారు. తమ పాప కనిపించడం లేదంటూ మానస అనే చిన్నారి తల్లిదండ్రులు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింప చర్యలు చేసట్టారు. ఈ నేపథ్యంలో మానసను హత్య చేసి పెన్నానదిలో పడేసినట్లు దుండగులు చిన్నారి తల్లిదండ్రులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి మృతి చెందిందని తెలిసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించడొం పలువురిని కంటతడి పెట్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *