కడప : తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని కడప నూతన నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నగర పాలక కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నగర శివారులో విలీనం చేసిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిపేందుకు కృషిచేస్తామన్నారు. సిబ్బంది సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని ఆయన తెలిపారు.




