శ్రీకాకుళం జిల్లా : వంశధార నదిలో జరుగుతున్న ఉమ్మడి సర్వేలో భాగంగా నేటినుంచి మన రాష్ట్ర భూ భాగంలో సర్వే ప్రారంభం కానుంది. నిన్నటితో ఒడిశా భూభాగంలో సర్వే పూర్తయిందని నేటినుంచి నేరడి బ్యారేజీకి దిగువన సుమారు 10 కిలోమీటర్ల మేర సర్వే జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. నేరడి బ్యారేజీ జీరో పాయింట్ నుంచి ఎగువన 15 కిలోమీటర్ల మేర ఒడిశా ప్రాంతంలో సర్వే నిర్వహించారు. నేటినుంచి మన రాష్ట్ర భూభాగంలో నేరడి, కాట్రగడ్డ , బత్తిలి ప్రాంతాల్లో సర్వే జరుగనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.




