Wednesday, 4 November 2026

కడప: భర్త చేతిలో భార్య హత్య

ముద్దనూరు: మండల పరిఽధి పెనికలపాడు గ్రామంలో శనివారం రాత్రి తెల్లపోరి లత (30)ను ఆమె భర్త చండ్రాయుడు హత్య చేసినట్లు ఎస్‌ఐ యుగంధర్‌ తెలిపారు. పెనికలపాడు గ్రామానికి చెందిన లత, చండ్రాయుడులకు 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శని వారం రాత్రి తిరుపతికి వెళ్తుండగా పిల్లలను కూడా తిరుపతికి తీసుకెళ్లే విషయమై ఘర్షణ పడ్డారు. మచ్చుకత్తితో తలపై కొట్టడంతో లత చనిపోయింది. ఈవిషయాన్ని దాచి ఉరి వేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించారు. లత బంధువులు గాయాలను గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత ్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *