కన్న కూతురిని రైలు నుంచి తోసేసిన తండ్రి

అనంతపురం,: జిల్లాలోని ధర్మవరంలో దారుణం జరిగింది. రెండేళ్ల చిన్నారిని రైలు నుంచి తండ్రి కిందికి తోసేశాడు. ఈ ఘటనలో ఆ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఆ చిన్నారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం కోల్పోయి ఇలా చేశాడా? లేక తాగిన మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు