భాజపా
ఒంగోలు సాంస్కృతికం: అరుగురు కళంకిత మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి కోయి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మాట్లాడుతూ సీబీఐ విచారణ జరుగుతున్నది వైఎస్ ప్రభుత్వంలోని మంత్రులపైనే అన్న సంగతిని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మంత్రుల తొలగింపును చేపట్టకపోతే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవ్వడం సత్యమన్నారు. ఈ సమావేశంలో భాజపా నాయకులు బత్తిన నర్సింహారావు, మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.




