తూర్పుగోదావరి, మార్చి 4: పురుగులమందు తాగి ఓ పురోహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ సమీపంలోని ఇంద్రపాలెంలో ఈ ఘటన జరిగింది. ఇంద్రపాలెంలో నివాసముంటున్న శ్రీనివాసశర్మ(40) పురోహితుడుగా పనిచేస్తున్నారు. శ్రీనివాసశర్మకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. శర్మ కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనలో శ్రీనివాసశర్మ మృతి చెందగా, భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.




