Wednesday, 4 November 2026

కారును ఢీకొన్న టిప్పర్: ఒకరి మృతి

ప్రకాశం:టంగుటూరు సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. టంగుటూరు మండలం ఓళ్లూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలుకు చెందిన కాలే శివప్రసాద్ (39) తన కుటుంబ సభ్యులతో పెళ్లి షాపింగ్ కోసం కారులో చెన్నై వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని ఓళ్లూరు గ్రామ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ కారును ఢీ కొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *