అనంతపురం, జనంసాక్షి: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట క్రాస్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు. లారీ ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.




