Tuesday, 3 November 2026

కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

చిత్తూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అందరికీ ఫించన్లు, పీఎఫ్‌, బోనస్‌ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ సీఐటీయూ నాయకులు చేశారు.కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం వెంటనే స్వస్తి పలకాలని  డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ కార్మికులు, పలు ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఒప్పంద కార్మికులు, మధ్యాహ్న భోజన తయారీ నిర్వాహకులకు కనీస వేతనాలు కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆరోపించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గౌరవ వేతనం ఇవ్వడంతోపాటు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. వీటి సాధనకు తామునిరంతరంగా పోరాడుతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *