అనంతపురం,ఫిబ్రవరి28(జనంసాక్షి): జిల్లాలో తరచూ దొంగనోట్ల చెలామణి బయటపడడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ తమకు దొంగనోట్లు వచ్చి చేరుతాయో అని ఆందోళన పడుతున్నారు. ఎటిఎంలలో డబ్బులు డ్రా చేసిన తరవాత అందులో ఇలాంటి నోట్లు ఉన్నాయేమోనని సరిచూసుకుంటున్నారు. అవసరమైతే స్లిప్పులు తీసుకుని బ్యాంకులకు వెళ్లి తనిఱఖీ చేసుకుంటున్నారు. కణెళికల్లు మండల కేంద్రంలో గత మూడు నెలలుగా దొంగనోట్లను తయారు చేసి, మార్చుతున్న ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 45 వేలు విలువైన రూ. 50 దొంగనోట్ల కట్టలు, కలర్ ప్రింటర్, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మరో నలుగురు సభ్యులు పరారీలో ఉన్నారు. దొంగనోట్లను తయారు చేసి మార్చడానికి రాయదుర్గం వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.గత కొంతకాలంగా దొంగనోట్లను తయారు చేసి మార్చుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అయితే వీరు ఎన్ని నోట్లను మార్చుకున్నారన్నది తెలియాల్సిఉంది. ఇందులో పెద్ద నోట్లు ఉన్నాయా అన్నది కూడా తెలుసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఇవి మార్చారో ఆరా తీస్తున్నారు. 50 నోట్ల కట్టలను రాయదుర్గంలో మార్చడానికి ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కుతూ అక్కడున్న పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ప్రింటర్ ద్వారా నోట్లను ముద్రించి మార్చుతున్నట్లు ముఠా సభ్యులు తెలిపారు. ఇలా ఇతర చోట్ల ఎవరైనా నోట్ల మార్పిడి చేస్తున్నదీ ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే తరచూ దొంగనోట్ల వ్యవహారం రావడంతో బ్యాంకర్లు కూడా ఆందోళనకు గురవుతున్నారు.




