Tuesday, 3 November 2026

కాల్‌మనీ నిందితుడి అరెస్ట్‌

విజయవాడ,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో అధికార టీడీపీకి చెందిన కాల్‌మనీ వ్యాపారి మండవ రవికాంత్‌ను  పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఆ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు కృష్ణలంకలోని రవికాంత్‌ ఇంటికి చేరుకున్నారు. అనంతరం బాధితులకు మద్దతుగా ధర్నా చేశారు. కాల్‌మనీ పేరుతో 10 మంది మహిళలను రూ. కోటి వరకు మోసం చేశాడని ఆయా సంఘాలు ఆరోపించాయి. రవికాంత్‌కు అండగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు వారు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *