శ్రీనగర్ : కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు పోలీసులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. జమ్మూకాశ్మీర్ సాయుధ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు పోలీసులు కుప్వారా జిల్లాలోని హంద్వారాలో విధుల్లో వుండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. గాయపడిన పోలీసులను వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.




