గుంటూరు : ఏపీ ప్రత్యేక హోదా విషయంపై సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న సంజీవరావు కిందకు దిగేందుకు అంగీకరించాడు. శనివారం ఉదయం 11గంటలకు సంజీవరావు టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సంజీవరావుతో కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులను కలిసేందుకు అనుమతించాలని సంజీవరావు కోరాడు. దీనికి కలెక్టర్ అంగీకరించారు. దీనితో టవర్ నుండి కిందకు దిగేందుకు సంజీవరావు అంగీకరించాడు.




