Wednesday, 4 November 2026

కుటుంబ నియంత్రణ లక్ష్యాలు సాధించాలి

కడప,మార్చి3(జ‌నంసాక్షి): కుటుంబ నియంత్రణ లక్ష్యాలు సాధించడానికి అందరూ సహకరించాలని కలసపాడు మండల వైద్యాధికారి వై.రవీంద్రకుమార్‌ తెలిపారు. కలసపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మండలస్థాయి ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుటుంబ నియంత్రణపై ప్రజలను చితన్యం వంతం చేయాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో మేరీ తెరేశమ్మ, హెచ్‌ఈవో పీరయ్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కలసపాడు మండలంలోని మల్లువారి ప్రాథమిక పాఠశాలను ఎంఈవో కె.వెంకటరామిరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరు పట్టిక, నగదు పస్తకంతో పాటు మరో 17 రకాల రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్‌ విజయ్‌కుమార్‌, సీఆర్పీ జోహర్‌తాజ్‌, ప్రధానోపాధ్యాయుడు కె.చెంచురామారావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *