విజయవాడ,మార్చి3(జనంసాక్షి): గంపలగూడెం మండలంలోని 8 ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షను నిర్వహించగా 550మంది విద్యార్థులు పాల్గొన్నారు. 16వతేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. మార్చి 26నుంచి పదోతరగతి సంవత్సరాంతపు పరీక్షలు ప్రారంభమవుతాయి. ముందస్తుగా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.




