Wednesday, 4 November 2026

కృష్ణా: ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

చిట్టినగర్‌: జక్కంపూడి హౌసింగ్‌ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఉప్పతల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఉప్పతల వెంకటేశ్వరరావు మొదటి భార్య మృతి చెందటంతో మంగళగిరికి చెందిన లలితను రెండో వివాహం చేసుకున్నాడు. అతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగు తున్నాయి. శుక్రవారం లలిత మంగళగిరిలో ఉంటున్న నాయనమ్మను చూసివచ్చేందుకు వెళ్లి శనివారం సాయంత్రం వచ్చి ఇంటి తలుపులు తీయగా ఇంట్లో ఫ్యాన్‌ హుక్కుకు భర్త ఉరేసుకుని వేలాడుతున్నాడు. ఆమె పెద్ద చుట్టు పక్కల వారిని పిలవగా అప్పటికే వెంకటేశ్వరరావు మృతి చెంది ఉన్నాడు. సమా చారం అందుకున్న పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమా నాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *