Wednesday, 4 November 2026

కృష్ణా: ఇల్లు అద్దెకు కావాలని వచ్చి నగలు అపహరణ

పామర్రు: ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన వ్యక్తులు ఆ ఇంటి యజమాని బంగారు ఆభరణాలు అపహరించారు. పోలీసుల కఽథనం ప్రకారం గాంధీనగరంలో నివాసముంటున్న వల్లూరుపల్లి ధనలక్ష్మి ఇంటికి శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు. ఈ ప్రాంతంలో అద్దెకు ఇచ్చే ఇళ్ళు లేవని ఆమె తెలుపగా బందరురోడ్‌లో మీకు ఇల్లు ఉన్నట్టు తెలిసిందని, దానికి అడ్వాన్స్‌ ఇవ్వడానికి వచ్చామని తెలిపారు. దీంతో లోపల ఉన్న ధనలక్ష్మి బయటకు రాగా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి చేతికి ఉన్న బంగారు గాజులు, పర్సు అపహరించుకుపోయారు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రాగా వారు పరారయ్యారు. బాధితురాలు ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.వెంకటనారాయణ కేసు నమోదు చేయగా సీఐ కె.ధర్మేంద్ర దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *