Thursday, 5 November 2026

కేంద్రంతో కయ్యానికి ఇది సమయం కాదు

హావిూలను రాబట్టుకునే చతురత ముఖ్యం
విజయవాడ,మార్చి9(జ‌నంసాక్షి): ఎపికి ప్రత్యేక ¬దా విషయంలో ఇప్పుడు బాగా ఇరుకునపడ్డది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే. ఆయన విభజన సమయంలో దీనిపై గ్టటిగా పట్టుపట్టి నాటి ప్రధాని మన్‌ఓమన్‌ను ఒప్పించారు. కానీ ఇప్పడు సాధ్యం కాదని చెబుతున్నదీ ఆయనే. అయితే ఇక్కడ వెంకయ్యనాయుడిని తప్పు పట్టాల్సింది లేకపోయినా,రాజ్యాంగం ప్రకారం ఉన్న అడ్డంకుల కారణంగా ఇప్పటికప్పుఉడ సాధ్యం కాకపోవచ్చు. అయితే ఇందులో రాజకీయం కూడా లేకపోలేదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని టార్గెట్‌ చేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల న్యాయం జరగాలని కోరుకోవడంలో తప్పు లేదుగానీ, కేంద్రంలో కనీసం ఏపీ తరఫున మాట్లాడే వెంకయ్యను కూడా టార్గెట్‌ చేస్తే ఎపి తరపున కేంద్రంలో వాయిస్‌ వినిపించేవారు ఉండరని ఎవరూ గ్రహించడం లేదు. సీమాంధ్ర నాయకత్వం ఇప్పుడు సమైక్య స్ఫూర్తిని ప్రదర్శించలేకపోతున్నదన్న విమర్శలు ఉన్నాయి.  ఆ రోజు రాజ్యసభలో వెంకయ్యనాయుడు పట్టుబట్టడం వల్లనే కనీసం కొన్ని హావిూలైనా లభించాయి. ఆయన కూడా పట్టించుకోకపోతే పరిస్థితి ఏమిటి? అన్నది బిజెపి నాయకులు వాదనగా ఉంది. వెంకయ్యనాయుడు ప్రత్యేక ¬దా కోసం ఆనాడు పట్టుబట్టారని, ఇప్పుడు కూడా హావిూల అమలుకు ఉన్న అడ్డంకులను అధిగమించడానికి కృషి చేస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు. రాష్ట్రం తరఫున కేంద్రం వద్ద గొంతు వినిపించడానికి వెంకయ్యనాయుడుకి అండగా నిలబడాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్ర కేబినెట్‌ నుంచి తప్పుకోవాలని కొంతమంది కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల సమస్యపరిష్కారం కాకపోగా పెద్దది అవుతుంది. వీరు రాజీనామాచేయడం వల్ల బిజెపికి వచ్చే నష్టం ఏవిూ ఉండబోదు. కేంద్రంలో ప్రభుత్వం సజావుగా నడవటానికి నరేంద్ర మోదీకి ఏ మిత్రపక్షం మద్దతూ అవసరం లేదు. బీజేపీతో తెలుగుదేశం పార్టీ సంబంధాలను తెగతెంపులు చేసుకుంటే నష్టపోయేది ఏపీ ప్రజలేనని గుర్తుంచుకోవాలని అంటున్నారు.  ఈ విషయాన్ని గుర్తించడం వల్లనే  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ విసయంలో మంత్రులు, ఇతర పార్టీ నాయకులను దిశా నిర్దేశం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయవద్దని ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధాలు  మెరుగ్గా ఉండడం వల్ల మెల్లగా రావాల్సిన నిధులు, అందాల్సిన సహకారం వస్తుందని భావిస్తున్నారు. దీనావస్థలో ఉన్న ఏపీని ఆర్థికంగా బలోపేతం చేయవలసిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంటుంది. ఆయనపై నమ్మకంతోనే ప్రజలు అధికారం అప్పగించారు కనుక ఆయన కేంద్రం నుంచి రావలసినవి సాధించుకోవడంలో సంయమనం పాటిస్తున్నారు. వెంకయ్య కూడా ఎపికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఇదే సందర్భంలో  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్షాల్లో విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇంతవరకు ఒక్క అంశంపై కూడా అఖిలపక్షాన్ని నిర్వహించలేదు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ- తెలుగుదేశం పార్టీల మధ్య ఉప్పు- నిప్పు అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా హావిూల అమలులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రయాణించడానికి కాంగ్రెస్‌ పార్టీ కొంతవరకు సుముఖంగానే ఉంది.  ఏపీకి ప్రత్యేక ¬దా అమలు వంటి విషయాలలో సోనియాగాంధీని, మన్మోహన్‌సింగ్‌లను కలిసిన రఘువీరా తనవంతుగా కృషి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో మాట్లాడటానికి మన్మోహన్‌సింగ్‌ను వారు ఒప్పించారు. రాష్ట్ర విభజన అనివార్యమేనని తెలిసిన తర్వాత ఏపీకి న్యాయం జరిపించడానికి జె.డి.శీలం వంటివారు చిత్తశుద్ధితోనే ప్రయత్నించారు. రాష్ట్రం విడిపోవడాన్ని ఆయన బాహాటంగానే అప్పుడూ ఇప్పుడూ సమర్థించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ముందుపెట్టి కాంగ్రెస్‌ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించడం మంచిదన్న భావన ఉంది.  అయితే ఏ రాజకీయ పార్టీ ఏ వైఖరి తీసుకున్నా అంతిమంగా అది ఏపీ ప్రజలకు మేలు జరిగేదిగా ఉండాలని, ప్రత్యేక ¬దా విషయంలో ఉమ్మడిగా ముందుకు సాగడం అవసరమని వివిధ పార్టీల నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.  ప్రధానమంత్రిగా కనీసం పదేళ్ల పాటు ఉండాలని నరేంద్ర మోదీ భావిస్తున్నారు కనుక ఏపీకి న్యాయం చేయడంతో పాటు- తెలంగాణకు నష్టం జరగకుండా ఉదారంగా వ్యవహరించవలసిన అవసరం మోడీకి ఉంది. రాష్టాల్రను ఆదుకునే విషయంలో గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉదారంగానే ఉంటున్నారు. ఈ దశలో వెంకయ్యనాయుడిని విమర్శించకుండా ఆయన ద్వారానే లక్ష్యసౄదనకునేతలు కృషి చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *