ఏలూరు,మార్చి3(జనంసాక్షి): నర్సాపురం గ్రావిూణం: దేశంలోని పలు రాషాల్లో కొబ్బరిపీచు పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.1500కోట్లు వెచ్చిస్తోందని దక్షిణాది రాష్టాల్ర క్వాయర్ బోర్డు ప్రాంతీయాధికారిణి ఇజ్బాల్‌రోజ్ యాంటో తెలిపారు. క్వాయర్ బోర్డు ఆధ్వర్యంలో నర్సాపురం మండలం పెదమైనవానిలంకలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరిపీచు పరిశ్రమల స్థాపనకు సహకారమందిస్తామన్నారు. సమావేశంలో ఎంపీడీవో కె.కన్నంనాయుడు, ఎంపీపీ వాకాటి కనకరాజు, డిప్యూటీ తహశీల్దారు సి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని వ్యవసాయశాఖ ఏలూరు డివిజన్ సహాయ సంచాలకురాలు పి. సుధారాణి అన్నారు. దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం సాగుచేస్తున్న గ్దదె సతీశ్ బాబు పొలాన్ని పరిశీలించారు. ఆయన అవలంబిస్తున్న వ్యవసాయ విధానాన్ని అధికారులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారిణి కాళీమాత, ఆత్మ బీపీఎం తుమ్మల వెంకటేశ్వరరావు, ఏఈవో నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు రాజా పాల్గొన్నారు.




