కృష్ణా, (మార్చి20): కృష్ణా జిల్లా నందివాడ మండలం గండిగానపూడిలోని చేపల చెరువుపై గుర్తు తెలియని వ్యక్తులు ప్రయోగం జరిపారు. ఆరు ఎకరాల విస్తీర్ణమున్న ఈ చేపల చెరువులో రూ. పన్నెండు లక్షలు విలువ చేసే చేపలు ఉన్నాయి. చెరువులో విషప్రయోగం జరగడంతో చేపలు మృతి చెందాయి. ఎంతో విలువైన చేపలు విషప్రయోగానికి గురై మృతి చెందడంతో చేపల చెరువు యజమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.




