విజయవాడ, మార్చి 11: గన్నవరం మండలం దావాజిగూడెంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన దావాజిగూడెంలో తీవ్ర కలకలం రేపింది. ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి.. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లి మధ్యలోనే తిరిగొచ్చింది. అనంతరం ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకుని ఆమె కుటుంబానికి సమాచారం అందించారు.




