Monday, 2 November 2026

గాయని సుశీలకు చంద్రబాబు అభినందన

హైదరాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): గిన్నిస్‌ రికార్డు సాధించిన గాయని సుశీలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. సుశీల గిన్నిస్‌ రికార్డు నమోదు చేయడం తెలుగువారందరికీ గర్వకారణమని, ఆరు భాషల్లో 17వేలకు పైగా పాటలు పాడటం సుశీలకే సాధ్యమైందని చంద్రబాబు అన్నారు. ఆమె పాటలు ఆపాత మధురాలని అన్నారు. ఆమె ప్రపంచ ప్రఖ్యాత గాయని కావడం తెలుగవారిగా మనకందరికి గౌరవమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *