Monday, 2 November 2026

గీతం విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌

విశాఖపట్టణం,మార్చి31(జ‌నంసాక్షి): ప్రతిభ కనబర్చే విద్యార్థులకు గీతం విద్యాలయం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వివిధ సబ్జెక్టుల్లో ఇక నుంచి రూ.10 కోట్లు వరకు ఉపకార వేతనాలుగా అందజేయడానికి నిర్ణయించారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, లా, ఇంటర్నేషనల్‌బిజినెస్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు వీటిని అందజేస్తారు. ఈ మేరకున బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సమావేశంలో నిర్ణయించామని  వీసీ ఆచార్య ఎం.ఎస్‌.ప్రసాదరావు పేర్కొన్నారు. వర్సిటీ నిర్వహిస్తున్న వివిధ వృత్తి విద్యాకోర్సుల్లో ఇకపై పరిశ్రమల ప్రాధాన్యం పెరిగేలా ప్రముఖ కంపెనీలతో కలిసి విశాఖ, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాల్లో అధ్యయన శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామన్నారు. ఇది విద్యార్థఝులకు ఎంతగానో ఉపయోగ పడడమే గాకుండా, వారికి ఉద్యోగావకాశాలకుకూడా మార్గాలను చూపగలదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *