గుంటూరు,మార్చి2(జనంసాక్షి): రహదారులను ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కన్నబాబు నిర్ణయించారు. పుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు సాగించడంతో పాదచారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఎక్కడపడితే అక్కడ ప్లెక్సీలు, ¬ర్డింగ్‌లు పెట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో రహదారులను, పుట్‌ఫాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అవసరమనఇగుర్తించారు. ఈ యమేరకు గుంటూరు నగర అభివృద్ధికి అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ తోల కలసి ఇప్పటికే చర్చించారు. అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దృష్టి సారించారు. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. రహదారులపై గోతుల కారాణంగా ట్రాఫిక్ నిలచిపోవడం, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధ్వాన రహదారులకు వెంటనే మరమ్మతులు చేయించడం ద్వారా ఈ సమస్యనుఅధిగమించాలని నిర్ణయించారు. నగరంలోని ప్రధాన కూడళ్లల్లో నిఘా ఏర్పాటు చేయడం,. పాదచారులు రాకపోకలకు వీలుగా జీబ్రా గీతలు వేయించడం. ప్లెక్సీలు, ¬ర్డింగ్‌లు తొలగించడం. నగరాభివృద్ధికి అవసరమైన చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో విగ్రహాలను ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లపైన, వీధుల్లో అనేకం ఉన్నాయి. వీటి వల్ల ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల గొడవలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుమతి లేని వాటిని తొలగించాలనే న్యాయస్థానం ఉత్తర్వులతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాల వివరాలతో కూడిన నివేదిక సత్వరం ఇవ్వాలని డీపీఓలను ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర, స్థానిక నాయకులుగా వర్గీకరించి ఇవ్వాలని సూచించింది. అనుమతిలేని వాటితోపాటు, అనుమతి తీసుకొన్నవాటి వివరాలు అందజేయాలని పేర్కొంది. ప్రభుత్వం కోరిన వివరాల్ని గ్రామ కార్యదర్శులు పంపారు. దీంతో జిల్లాలో విగ్రహాల లెక్క పక్కాగా తేలింది. కొన్ని గ్రామాల్లో ఇంకా ఆవిష్కరణకు నోచుకోనివి అనేకం ఉన్నాయి. వీటికి ముసుగులు వేసి నాయకుల పేర్లు రాసి ఎదురు చూస్తున్నాయి.కొత్త రాజధానికి సన్నాహాలు జరుగుతన్న తరుణంలో ఈ చర్యలపై అధికారులు నిర్ణయాలు తీసుకోబోతున్నారు.




