Wednesday, 4 November 2026

గుంటూరు సీసీఐలో సీబీఐ తనిఖీలు…

గుంటూరు:నగరంలో సీసీఐ ప్రధాన కార్యాలయంపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. బుధవారం జరిగిన ఈ దాడుల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 2014-15 ప్రత్తి కొనుగోళ్లకు సంబంధించి కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ సీసీఐ మేనేజర్‌ ఆర్‌.జయకుమార్‌ నుంచి వివరాలు సేకరించారు. విశాఖ నుంచి వచ్చిన ఏడుగురు సీబీఐ అధికారులు ఉదయం పది గంటల నుంచి తనిఖీలు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *