గుంతకల్లు : అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్‌లో సోమవారం కంట్రోల్ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ నూతనంగా వాయిస్‌లాగర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని డీఆర్‌ఎం తేజేందర్‌పాల్ సింగ్ ప్రారంభించారు. దీంతో రైల్వే గేట్లను మూయటం, తెరవటంలో గేట్‌మెన్‌లు స్టేషన్ మాస్టర్‌తో జరిపే సంభాషణ ఇక నుంచి రికార్డు కానుంది. ఇందులో ఎవరు తప్పులకు పాల్పడ్డారో వాయిస్‌లాగర్ ద్వారా సమాచారాన్ని తీసుకొని వారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు నేటి నుంచి అందుబాటులోకి రానుందని రైల్వే డీఆర్‌ఎం చెప్పారు. గేట్‌మెన్ల నిర్లక్ష్యం వల్ల లెవల్ క్రాసింగ్‌ల్లో జరిగే ప్రమాదాలను నివారించటానకి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన అన్నారు.




