గుంటూరు(నేరవిభాగం): గొలుసుకట్టు రూపంలో సుమారు రూ.50లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న ‘హిమ్’ సంస్థ ఏజెంట్ పులివర్తి స్వరాజ్యలక్ష్మిని గుంటూరు సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తెనాలికి చెందిన ఈమె గత రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతోంది. ఈ క్రమంలో సీఐడీ పోలీసులు చెన్నైలో ఆమెను అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి తదిపరి విచారణ చేయనున్నట్లు సీఐడీ సీఐ విజయకృష్ట తెలిపారు.




