చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తిలో భూదేవి, శ్రీదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చక్రస్నాన కార్యక్రమం వేడుకగా జరిగింది. వైష్ణవ కోనేటిలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. విశేష ఉత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొని పుణ్యస్నానాలు అచరించారు.




