గుంతకల్ : అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కస్సాపురం నెట్టికంటి అంజనేయ స్వామి దేవస్థానంలో ఐదు రోజుల పాటు హనుమజ్జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా చివరిరోజైన సోమవారం అలయంలో శ్రీ సీతారామ స్వామి పట్టాభిషేకం జరిగింది. వేద పండితులు హోమాన్ని నిర్వహించారు. నగర ఉత్సర సమితి ఆధ్వర్యంలో అంజనేయ స్వామి విగ్రహాన్ని ఉంచిన అలయ ఉపకమిషనర్ సురేష్, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మల ఆధ్వర్యంలో జరిగాయి.




