Tuesday, 3 November 2026

చంద్రబాబుకు తీవ్రమైన కాలు నొప్పి

కాకరపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రమైన కాలునొప్పితో బాధపడుతున్నారు. మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబుకు శుక్రవారం కాలినొప్పి తీవ్రతరం కావటంతో హైదరాబాద్‌ నుంచి వైద్యుల బృందం చేరుకుని పరీక్షలు నిర్వహించింది. పాదయాత్రను పూర్తిగా ఆపివేయాలని ఆయనకు వైద్యులు ఈ సందర్బంగా నూచించారు. టీడీపీ నేతలతో చర్చించి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *