Tuesday, 3 November 2026

చిగురువాడ వద్ద ఎర్రచందనం లారీ బోల్తా

తిరుపతి, జనంసాక్షి: తిరుపతి సమీపంలో చిగురువాడ వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఎర్రచందనం దుంగలతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఎర్రచందనం దుంగలను స్మగ్లర్ల చంద్రగిరి నుంచి రామచంద్రాపురంకు అక్రమంగా తరలిస్తున్న ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడి ఉందని పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిగా అక్కడకు వెళ్లి పరిశీలించగా, బోల్తా పడ్డ లారీలో ఎర్రచందనం దుంగలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
అయితే స్మగ్లర్లు మాత్రం లారీని వదిలి పారిపోయారు. సంఘటనా స్థలం వద్ద ఎవరూ లేకపోవడంతో లారీని పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఆ లారీలో మొత్తం 47 ఎర్రచందనం దుంగలు ఉన్నాయని, వారి విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *