చిత్తూరు: జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుప్పం, రామకుప్పం మండలంలో పంటల ధ్వంసానికి పాల్పడుతున్నాయి. దీంతో టమోటా, అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బోర్ వెల్ లను నాశనం చేయాయి. ఇంత నష్టం జరుగుతున్నా అటవీ అధికారులు మాత్రం స్పందించడం లేదని.. నిద్రమత్తులో జోగుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టం లక్షల రూపాయల్లో ఉంటుందని అంచనా. గతంలో జరిగిన నష్టానికి ఎకరాకు 5 వేల రూపాయలు మాత్రమే నష్టం పరిహారం చెల్లించారు. ఏనుగులను తమిళనాడు సరిహద్దులోకి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.




