Thursday, 5 November 2026

చురుకుగా బిజెపి సభ్యత్వ నమోదు

అనంతపురం,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)
: జిల్లాలో బిజెపి సభ్యత్వ నమోదు ఆశాజనకంగా ఉందని జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి తెలిపారు. ప్రజలు గతంలో ఎన్నడూ లేనివిధంగా బిజెపి సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ఆన్‌లైన్‌ సభ్యత్వం కూడా చేపట్టామని అన్నారు. దేశంలో పదికోట్ల సభ్యత్వం లక్ష్యంగా సాగుతున్నామని అన్నారు.  రాష్ట్రం సత్వర అభివృద్ధికి తగినన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం, ప్రధాని మోదీ సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు అయ్యే వ్యయం, కొత్త పారిశ్రామికవాడలకు స్థలం అంశాలపై ఎంతమేరకు నిధులు అవసరమయ్యేది సమగ్ర ప్రణాళిక రూపొందించి కేంద్రానికి పంపించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో అన్నిరంగాల ఆర్థికాభివృద్దికి కేంద్రం తగినంత నిధులు మంజూరుకు సిద్ధంగా ఉందనిఅంకాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి పథకాలకు అవసరమైన నిధులు ఇస్తామన్న హావిూకి భాజపా ఇప్పటికీ కట్టుబడిఉందన్నారు.  50ఏళ్ల పాలనలో దేశాన్ని అధోగతి పాలుజేసిన కాంగ్రెస్‌ పార్టీ, విపక్షాలు మాత్రం తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఏవిూ చేయలేదని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.. నిరంతర విద్యుత్తు సరఫరా కోసం నిర్మించనున్న ప్రాజెక్టులకు అవసరమైన స్థలం మంజూరు, వీటి నిర్మాణాలకు ఎంతవ్యయం అవసరమవుతుందోనని ప్రణాళిక రూపొందించి కేంద్రానికి నివేదిక అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని చెప్పారు. ఆంధప్రదేశ్‌కు కేంద్రం ఎక్కువ నిధులు అందించిందన్నారు. అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితిపై నివేదిక, సోలార్‌ ప్రాజెక్టుకు భూసేకరణ వంటి విషయాలపై నివేదిక అందిన వెంటనే నిధులు మంజూరవుతాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *