గుంటూరు (మార్చి 04): రాజధాని ప్రాంతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించిన చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఏపీకి కొత్త రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాలో చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ జగన్ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ తీరును ఖండిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఈ వినూత్న శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిని చంద్రబాబు నిర్మిస్తారని ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మల్లి అన్నారు. జగన్ మాటలు నమ్మి ప్రజలు మోసపోరాదని పిలుపునిచ్చారు.




