అనంతపురం, జనంసాక్షి: జిల్లా కేంద్రంలోని ముదిగుబ్బ మార్కెట్‌లో ఓ లారీ జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను తమకు అప్పగించారు. లారీ డ్రైవర్‌ను తమకు అప్పగించాలని పోలీస్‌స్టేషన్ ముందు ప్రజల ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.




