Wednesday, 4 November 2026

జులైలో కొత్త ఎక్సైజ్ పాలసీ: మంత్రి రవీంద్ర

విజయవాడ:జూలై నెలలో నూతన ఎక్సైజ్‌ పాలసీ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 13 జిల్లాల అధికారులతో మంత్రి సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఇతర రాషా్ట్రలను అధ్యయనం చేస్తున్నామనీ, జూన్‌ నెలఖరు నాటికి నూతన ఎక్సైజ్‌ పాలసీని రూపొందిస్తామని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు జారిపోతారనే భయంతోనే ఆ పార్టీ అధినేత జగన్‌ ఈ నెల 15 నుంచి పట్టిసీమకు వ్యతిరేకంగా బస్సుయాత్ర చేయబోతున్నారని మంత్రి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *