తుళ్లూరు : గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, దొండపాడు మధ్యలో మూల మలుపు వద్ద ఓ ఆటోను టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్లకు చెందిన రాంబాబు (45), తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రపురానికి చెందిన రజిని(32)లు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా… వీరిద్దర్నీ చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరిద్ధరూ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.




