తిరుపతి, జనంసాక్షి: టీటీడీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ ప్రదేశాల్లో వివాహాలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. టీటీడీ సభ్యులు కొందరు ఆర్జితసేవా టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని భానుప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీటీడీ అధికారుల అక్రమ ఆర్జనపై త్వరలో ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.




