గుంటూరు,మార్చి3(జనంసాక్షి): భూ సవిూకరణ గడువు పూర్తయినా రైతులు ఇంకా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. భూ సవిూకరణకు అంగీకరించని రైతులు భూసేకరణ తప్పనిసరి పరి/-థసితుల్లో ఏమి చేయాలన్న విషయమై జోరుగా చర్చిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో 5వ తేదీన పర్యటించే అవకాశముంది. ఆయనతో కూడా తమ సమస్యలను చర్చించాలని చూస్తున్నారు. రాజధాని భూ సవిూకరణను వ్యతిరేకిస్తున్న రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. దీంతో మూడు మండలాల్లోనూ భూసేకరణకు వెళ్లాల్సి వస్తోంది. తుళ్ళూరు మండలంలో మొత్తం 24,118 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 22,597 ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించారు. గ్రామకంఠాలు, దేవాదాయ శాఖ, ప్రభుత్వ భూములు పోగా ఇంకా ఇంకా 500 ఎకరాల వరకు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. రాయపూడి, వెలగపూడి, మందడం, లింగాయపాలెం గ్రామాల్లో రైతులు భూములు ఇవ్వాల్సి ఉంది. మంగళగిరి మండలంలో 10,856 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,411 ఎకరాలు సేకరించారు. తాడేపల్లి మండలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. భూ సవిూకరణ ఫిబ్రవరి 28వ తేదీతో ముగియడంతో ఇక మిగిలిన అంశాలపై యంత్రాంగం దీనిపై దృష్టి సారించింది. భూ సవిూకరణ పక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో 9.2 దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 9.2 దరఖాస్తులపై స్పష్టత వస్తేనే భూ సేకరణకు వెళతారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారన్న వాదన వినిపిస్తోంది. 9.2 దరఖాస్తులను తిరస్కరిస్తే వారంతా మళ్లీ 9.3 దరఖాస్తు కింద అంగీకార పత్రాలు ఇచ్చే వెసులుబాటు కల్పిస్తారా ? లేదా ? అన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.




