విజయవాడ, జనంసాక్షి: టైమ్స్ ఆస్పత్రి ఎండీ హేమంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో అవకతవకలకు పాల్పడినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హేమంత్‌పై 467,468,471,419,420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో డబ్బులు డ్రా చేసేందుకు హేమంత్ ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి.




