
విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికలు..ఎలాంటి రాజకీయం లేకుండా జరగాల్సిన ఎన్నికలు రాజకీయమయం చేసేశారు..ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన పోలింగ్ లో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. ఉదయం నుండి విజయవాడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ కొద్ది గంటల్లో ముగుస్తుందనగా ఓటర్లకు డబ్బులు అందచేస్తున్న వ్యక్తులను సీపీఎం నేతలు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ”డబ్బు రాజకీయాలు..నశించాలి..సిగ్గు..సిగ్గు” అంటూ నినాదాలు చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీనిని చూసి సహించలేని టిడిపి నేతలు ఏకంగా సీపీఎం నేతలపై దాడులకు దిగారు. అక్కడనే పోలీసులు ఉన్నా ప్రేక్షకపాత్ర వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిడిపి అధికార దుర్వినియోగాన్ని సీపీఎం నేత బాబురావు తీవ్రంగా ఖండించారు. వెంటనే టిడిపి నేతలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.
ఆందోళన చేసిన అనంతరం అక్కడకు చేరుకున్న ఖాకీలు సదరు వ్యక్తిని పోలీసు జీపులో ఎక్కించుకున్నారు. టిడిపి నేతలు పంచిన డబ్బులను సీపీఎం నేతలు ఈ సందర్భంగా మీడియాకు చూపించారు.




