Tuesday, 3 November 2026

డీఎల్‌ బర్తరఫ్‌కు నిరసనగా ఖాజీపేటలో ఆందోళన

కడప : మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌కు నిరసనగా కడప జిల్లా ఖాజీపేటలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కడప`కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. డీఎల్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారనే కారణంతో ఓ మహిళ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాస్తారోకోతో జాతీయ రహదారిపై కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *