పయ్యావుల కేశవ్ దౌర్జన్యాలకు నిరసనగా ఆందోళన
అనంతపురం, సెప్టెంబర్ 13: టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ దౌర్జన్యాలకు నిరసనగా ఈనెల 16న బెలుగుప్ప తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెలుగుప్ప మండలం వై.రామాపురం గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో 10వ నిందితుడిగా పయ్యావుల శ్రీనివాసులు ఉన్నారన్నారు. ఈ హత్యకేసు నుంచి శ్రీనివాసులను రక్షించేందుకు కేశవ్ ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు.