Tuesday, 3 November 2026

తరగతి గదిలోనే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

శ్రీకాకుళం: డిగ్రీ విద్యార్థి తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో సోమవారం చోటుచేసుకుంది. రాజాంలోని జీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న తేజ తరగతి గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈరోజు ఉదయం కళాశాల తెరిచేసరికి విద్యార్థి చనిపోయినట్లు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని విజయనగరం జిల్లా పాములవలస వాసిగా గుర్తించారు.తేజ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *